![]() |
![]() |

కాక్‌టైల్, హిందీ మీడియం, స్త్రీ వంటి సినిమాలు తీసిన దినేష్ విజన్ అన్నా, అతని బ్యానర్ మేడోక్ ఫిల్మ్స్ అన్నా ఓ క్రెడిబిలిటీ ఉంది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్, కృతిసనన్ కూడా ఈ బ్యానర్‌లో ఆల్రెడీ పని చేశారు. లేటెస్ట్ బజ్ ప్రకారం అక్షయ్‌కుమార్ కూడా ఈ బ్యానర్‌కి ఓకే చెప్పారట. ఈ ప్రాజెక్టుకు స్కై ఫోర్స్ అనే టైటిల్ కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో అక్షయ్ కుమార్ ఇండియన్ ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారట. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సాధించిన అతి పెద్ద విజయాన్ని ఆధారంగా చేసుకుని, వాస్తవ ఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది మే నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది స్కై ఫోర్స్.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. హీరోయిన్‌గా ఓ ఫ్రెష్ ఫేస్‌ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట. అక్షయ్ కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆయన దగ్గర జూనియర్‌గా ఓ అమ్మాయి ఉంటుంది. మెంటర్‌కీ, జూనియర్‌కీ మధ్య ఇంట్రస్టింగ్ కాన్వర్జేషన్ కనిపిస్తుందట. యాక్షన్ డ్రామాగా కూడా స్క్రీన్‌ప్లేని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటిదాకా ఖిలాడీ కుమార్‌గానీ, ప్రొడక్షన్ సైడ్ నుంచి గానీ, అఫిషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. అక్షయ్‌కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా సెల్పీ. ఇమ్రన్ హష్మి కీ రోల్ చేశారు.
కమర్షియల్ అంశాలు దట్టించినా సరే, బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది ఈ సినిమా. ఈ చిత్రంతో అక్షయ్‌కుమార్‌కి తొమ్మిది ఫ్లాపులు వచ్చినట్టయ్యాయి. స్కై ఫోర్స్ తో పాటు అక్షయ్‌కుమార్‌కి మరికొన్ని ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద మాత్రం బడేమియా చోటేమియా ఉంది. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. ముంబైలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఫారిన్ షెడ్యూల్ జరుగుతోంది. తాను ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న హిట్ బడేమియా చోటేమియాతో దక్కుతుందని ఆశిస్తున్నారు అక్షయ్‌కుమార్.
![]() |
![]() |